Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రోల్స్ రాయిస్ కారు ఎక్కాలంటే రతన్ టాటా సిగ్గుపడేవారు

రోల్స్ రాయిస్ కారు ఎక్కాలంటే రతన్ టాటా సిగ్గుపడేవారు

Interesting Facts About Ratan Tata | టాటా సంస్థకే కాకుండా దేశ అభివృద్ధి కోసం దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ( Ratan Tata ) ఎనలేని సేవలందించారు. సంస్థకు వచ్చే లాభాల్లో అధిక శాతం సేవా కార్యక్రమాల కోసమే కేటాయించేవారు.

ఎంతో సింపుల్ ( Simple ) గా జీవించే రతన్ టాటా బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. దేశం ఒక ముద్దుబిడ్డను కోల్పోయిందని అభిమానులు తుది వీడ్కోలు పలుకుతున్నారు.

ఈ క్రమంలో రతన్ టాటా జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మళ్ళీ గుర్తుచేసుకుంటున్నారు. రతన్ టాటాను ఆయన నానమ్మ ముంబై లోని క్యాంపియన్ స్కూల్ లో చేర్పించారు.

రతన్ టాటాను ఆయన సోదరుడ్ని స్కూల్ నుండి తీసుకురావడానికి నానమ్మ ఓ పాత భారీ రోల్స్ రాయిస్ ( Rolls Royce ) కారును పంపేది. కానీ కారులో ఎక్కడానికి రతన్ టాటాకు ఆయన సోదరుడిగా సిగ్గుగా ఉండేదంట. కారులో ఎక్కే బదులు వారు నడుచుకుంటూనే ఇంటికి వెళ్లేవారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions