Rail One App | భారతీయ రైల్వే శాఖ (Indian Railway) రైలు ప్రయాణీకులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణానికి సంబంధించి ప్రస్తుతం వేరు వేరు సేవలకు వేర్వేరు యాప్ ల ద్వారా అందిస్తున్న సర్వీసులను ఒకే ప్లాట్ ఫాం లోకి తీసుకొచ్చింది.
దీని కోసం రైల్ వన్ (Rail One) పేరుతో ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Aswini Vaishnav) మంగళవారం ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికుల రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
రిజర్వడ్, అన్ రిజర్వడ్ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫాం టికెట్, రైల్ ఎంక్వైరీ, రియల్-టైమ్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్, PNR స్టేటస్, రీఫండ్‌లు తదిర సేవలన్నింటినీ ఈ రైల్‌వన్ ద్వారా పొందొచ్చు. ఈ రైల్‌వన్ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ గూగుల్ ప్లే స్టోర్ మరియు iOS మొబైల్స్ ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ ఉచితంగా లభిస్తుంది.