Indian Hockey Team | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics)లో భాగంగా భారత హాకీ టీం కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. క్రమంగా ఆదరణ కోల్పోతున్న స్థితి నుండి హాకీ టీం వరుసగా రెండు ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకోవడం యావత్ దేశానికి సంతృప్తినిచ్చింది.
బ్రాంజ్ కోసం జరిగిన పోరులో 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్ భారత టీం ఓడించింది. ఈ సందర్భంగా దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేశ్ ఘనంగా తన కెరీర్ ను ముగించారు. మరోవైపు కాంస్యాన్ని గెలిచిన భారత ఆటగాళ్లకు హాకీ ఇండియా తో పాటు ఒడిశా ప్రభుత్వం నజరానాను ప్రకటించింది.
ఒక్కొక్క ఆటగాడికి రూ.15 లక్షలు, సహాయ సిబ్బందికి రూ.7.5 లక్షలు నజరానాను హాకీ ఇండియా ప్రకటించింది. అలాగే అటగాళ్లందరికి రూ.15 లక్షలు, సహాయ సిబ్బందికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ఒడిశా సీఎం మాంఝి ప్రకటించారు. ఒడిషాకు చెందిన అమిత్ రోహిదాస్ రూ.4 కోట్ల రివార్డును ప్రకటించారు.