IND vs PAK Match | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy )లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ స్టేజ్ ( Group Stage ) మ్యాచులో టీం ఇండియా చేతిలో పాకిస్థాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
అయితే ఈ ఓటమిని కొందరు పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్లేయర్లు పోటీనివ్వలేక పాక్ ఓటమి పాలైతే, భారత్ క్షుద్రపూజలు చేసి గెలిచిందని కొందరు ఆరోపణలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.
పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆ దేశ న్యూస్ ఛానెల్స్ లో పెద్ద ఎత్తున డిబేట్లు ( Debates ) జరిగాయి. ఈ క్రమంలో డిస్కవర్ పాకిస్థాన్ అనే ఛానెల్ లో కూడా పాక్ ఓటమిపై డిబేట్ జరిగింది. ఇందులో పాల్గొన్న ఓ విశ్లేషకుడు భారత్ 22 మంది మాంత్రికులను దుబాయ్ తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేయించిందన్నాడు.
ఈ పూజలు కారణంగా పాక్ ఆటగాళ్లు పరధ్యానంలోకి వెళ్లారని దింతో మ్యాచ్ ను ఇండియా గెలిచిందన్నారు. అంతేకాకుండా మ్యాచ్ కంటే ముందు ఏడుగురు పండిట్లు గ్రౌండ్ లోకి వచ్చి పిచ్ పై కూడా పూజలు చేశారని చెప్పాడు.
పూజలు ద్వారా పాక్ ఆటగాళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారని సదరు డిబేట్ లో చర్చించారు. క్షుద్రపూజల నేపథ్యంలోనే టీం ఇండియా పాకిస్తాన్ రాలేదని, ఎందుకంటే వస్తే భారత పండిట్లు పూజలు చేయలేరని పాక్ విశ్లేషకులు చేసిన కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.