Tuesday 13th May 2025
12:07:03 PM
Home > క్రైమ్ > ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..సికింద్రాబాద్ లో టెన్సన్ టెన్షన్

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..సికింద్రాబాద్ లో టెన్సన్ టెన్షన్

Idol Vandalised At Mutyalamma Temple In Monda Market | సికింద్రాబాద్ ( Secunderabad ) లోని ముత్యాలమ్మ ఆలయం ( Mutyalamma Temple )లో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

సోమవారం తెల్లవారుజామున మొండా మార్కెట్ ( Monda Market ) కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

ముగ్గురు దుండగుల్లో ఒకర్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం వద్దకు భారీగా చేరుకుంటున్నాయి.

నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ),రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav )ఆలయం వద్దకు చేరుకున్నారు.

హిందు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మత కలహాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. అలాగే ఆలయ విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions