Wednesday 11th February 2026
12:07:03 PM
Home > క్రీడలు > భారత్ తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాక్.. ఆ జట్టుకు ఐసీసీ వార్నింగ్!

భారత్ తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాక్.. ఆ జట్టుకు ఐసీసీ వార్నింగ్!

icc warns pcb

ICC Warning To Pakistan | వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్ జట్టును తీవ్రంగా హెచ్చరించింది.

పాక్ జట్టు తమ ఇష్టానుసారం కొన్ని మ్యాచ్‌లు ఆడి, మరికొన్ని బహిష్కరిస్తామని ప్రకటించండం అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అందాల్సిన వార్షిక ఆదాయం సుమారు రూ. 280 కోట్లు నిలిపివేస్తామని ఐసీసీ హెచ్చరించింది.

ప్రపంచకప్ లాంటి గ్లోబల్ టోర్నమెంట్ మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం టోర్నీ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఐసీసీ అభిప్రాయపడింది. అన్ని జట్లు నిబంధనలకు అనుగుణంగా అన్ని మ్యాచ్ లు ఆడాల్సిందేనని తేల్చిచెప్పింది.

ఒకవేళ ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్‌కు పాక్ రాకపోతే, నిబంధనల ప్రకారం పాకిస్థాన్ 20 ఓవర్ల ఇన్నింగ్స్ పూర్తి చేసినట్టుగా భావిస్తారు. దీంతో జట్టు రన్ రేట్ పడిపోతుంది. అప్పుడు గ్రూప్ దశలో పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.  ఈ నేపథ్యంలో పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా జరిమానాకు సిద్ధపడుతుందో వేచి చూడాలి.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions