ICC announces initiative to support Afghan women cricketers | అఫ్గానిస్తాన్ లో తాలిబన్లు అధికారాన్ని చేపట్టిన నాటి నుండి దేశంలోని మహిళల స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఇందులో భాగంగా మహిళలు క్రికెట్ ఆడటంపై తాలిబన్లు నిషేధం విధించారు. దింతో మహిళా క్రికెటర్లు చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అఫ్గానిస్తాన్ మహిళా క్రికెటర్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది.
దీని కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా ప్రకటించారు. 2021లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత మహిళల క్రీడలపై నిషేధం విధించడంతో అఫ్గానిస్తాన్ జాతీయ మహిళా క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు.
అక్కడ శరణార్థులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా శరణార్ధులుగా మారిన అఫ్గాన్ మహిళా ప్లేయర్ల కోసం మరియు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకుంటున్న వారికోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఐసీసీ వార్షిక సమావేశాల్లో నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులతో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లకు నేరుగా ఆర్థిక సహాయం, ఉన్నత స్థాయి కోచింగ్, సౌకర్యాలను అందించడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు.