Thursday 19th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ మాజీ ఎమ్మెల్యే నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా

HYDRA Demolished Katasani Rambhupal Reddy Constructions | వైసీపీ ( YCP ) మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ( Katasani RamBhupal Reddy )కి సంబంధించిన కట్టడాలను ఆదివారం హైడ్రా ( Hydra ) నేలమట్టం చేసింది.

సంగారెడ్డి ( Sangareddy ) జిల్లా అమీన్ పూర్ లోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ( FTL ), బఫర్ జోన్ లో ఈ మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా పేర్కొంది.

అలాగే స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమీషనర్ రంగనాథ్ ( Ranganath ) గతవారం నిర్మాణాలను పరిశీలించారు. రాంభూపాల్ రెడ్డి మరియు అతని భాగస్వామి రమేష్ కలసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాకుండా కాటసాని పై క్రిమినల్ ( Criminal ) కేసును నమోదు చేసినట్లు రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని స్పందించారు.

భూసేకరణ చట్టబద్ధంగా జరిగినట్లు పేర్కొన్నారు. 1991 లోనే సదరు లే ఔట్ కు అనుమతులు ఇచ్చినట్లు, 2015లో కలెక్టర్ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు చెప్పారు.

You may also like
ఆక్రమిత ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా మరో సంచలన నిర్ణయం
హైడ్రా రావాల్సిన పనిలేదు..నేనే కూల్చేస్తా
ముంచేస్తున్న వరదలు..హైడ్రాపై నాగబాబు అభినందనలు
ఆంధ్రాలోనూ ‘హైడ్రా’..కూటమి నేతలు హాట్ కామెంట్స్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions