Hydra Commissioner Ranganath | హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా (Hydra) కూల్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల్లో, చెరువులు, కుంటలను కబ్జా చేసి చేపట్టిన అనేక నిర్మాణాలను హైడ్రా నేల మట్టం చేసింది.
ఇదిలా ఉండగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) తాజాగా కీలక ప్రకటన చేశారు. 2024 జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని తెలిపారు.
గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు వెళ్లబోమని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను నిర్మాణాలను హైడ్రా పరిశీలిస్తోందని తెలిపారు.
ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు పనిచేస్తున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు. పేదల జోలికి హైడ్రా రాదని భరోసా ఇచ్చారు. పేదల ఇళ్లను కూల్చివేస్తున్నామనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.