LB Nagar To Hayath Nagar Metro Route Map | హైదరాబాద్ మెట్రోరైలు (Hyderabad Metro Rail) నగరంలో రెండో దశ విస్తరణ చేపట్టనున్న విషయం తెలిసింది. అందులో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ (LB Nagar To Hayat Nagar Metro) వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర మెట్రో ట్రాక్ నిర్మించనున్నారు.
ఈ రూట్ లో మొత్తం 6 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ఎక్స్ వేదికగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రూట్ మ్యాప్ ను పోస్ట్ చేసింది
ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చింతల్ కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయతనగర్ వరకు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఈ రూట్ మ్యాప్లో పేర్కొంది. అదే విధంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ రూట్ ను కూడా పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే ఈ రూట్ లో 29 కి.మీ. ఉన్న మెట్రో రూట్ ను మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13.4 కిలోమీటర్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో హయత్ నగర్ వైపు కొత్త మార్గం కలిపి పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు నగరం వాయువ్య చివర నుంచి ఆగ్నేయ చివరి వరకు దాదాపు 50 కిలోమీటర్లు కనెక్టివిటీని తెస్తుందని పేర్కొంది.