High Court On Patnam Narender Reddy Arrest | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆరెస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తన రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయాలని పట్నం నరేందర్ రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం, కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్ కు వెళ్లిన సమయంలో పట్నంను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది.
అలాగే ఆయన అరెస్ట్ విధానాన్ని తప్పుపట్టింది. ఓ మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని కోర్టు నిలదీసింది. ఈ క్రమంలో లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
క్వాష్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డిపై నమోదు చేసిన స్టేట్మెంట్ ను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే అధికారులకు తీవ్రగాయాలు అయినట్లు రిపోర్టు ఇచ్చి, చిన్న గాయలైనట్లు రాశారని కోర్టు పేర్కొంది.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలుపెట్టనున్నట్లు పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.