Chenab Rail Bridge | భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్ లో నిర్మించింది. రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ రైల్వే వంతెనను నిర్మించారు. రైలు మార్గం ద్వారా కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ఇది.
చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ రైల్వే వంతెనను నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచరికార్డును ఇది అధిగమించింది.
ఈఫిల్ టవర్ కంటే చీనాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హెలికాఫ్టర్ షాట్- చీనాబ్ బ్రిడ్జ్ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.