Heavy Rains Lash Hyderabad, Bring Relief from Heat | ఉక్కపోత నుండి ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల గురువారం మోస్తరు వర్షం కురిసింది.
దింతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు. అయితే కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెలకుంది. దింతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో ఆయా జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్,మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇకపోతే నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్ పల్లి తో పిడుగు పడడం మూలంగా ఇద్దరు మహిళలు మృతిచెందారు.