- హరియాణా ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ
- ఆఫీస్ లో లిక్కర్ కు కొన్ని షరతులు విధించిన బీజేపీ సర్కార్
Beer Inside Office | రోజంతా ఆఫీసులో పని ఒత్తిడితో విసిగిపోయిన చాలా మంది యువకులు సాయంత్రం కాగానే ఓ బీరు (Beer) కొట్టి రిలాక్స్ అవుతుంటారు.
మరికొంత మంది ఎంచక్కా వీకెండ్ లో సిట్టింగ్ వేసి ఛిల్ అవుతుంటారు. అయితే ఇకనుంచి అంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండోయ్. ఎంచక్కా ఆఫీస్ లోనే బీర్ లేదా వైన్ (Wine) లాగించేయొచ్చు.
బ్రేక్ టైమ్ లో క్యాంటీన్ (Canteen) కి వెళ్లి టీ లేదా కాఫీ తాగి రిలాక్సవుతున్నట్టుగానే అలా ఓ బీరు కూడా లాగించేసి రావొచ్చట.
కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. హరియాణా ప్రభుత్వం (Haryana Government) ఈ కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది.
హరియాణాలో మనోహర్‌లాల్ ఖట్టర్ (Manoharlal Khattar) ప్రభుత్వం మే 9న ఒక కొత్త మద్యం పాలసీని రూపొందించింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాలసీ ప్రకారం, పెద్ద కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు బీర్ లేదా వైన్ వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలను ఆఫీస్ లోనే సేవించవచ్చు.
ఆఫీసులోనే కూర్చొని బ్రేక్ టైంలో లిక్కర్ తీసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని అన్ని కార్పొరేట్ సంస్థలకు అనుమతించలేదు. ఈ ఆఫీస్ మద్యం పాలసీ (Haryana Liquor Policy) కోసం అనేక హరియాణా ప్రభుత్వం అనేక షరతులు విధించింది.
ఈ సదుపాయాన్ని పొందాలంటే సంబంధిత కార్యాలయంలో కనీసం 5,000 మంది ఉద్యోగులు ఉండాలి. ఆఫీస్ స్పేస్ కూడా కనీసం లక్ష చదరపు అడుగులు ఉండాలి. అలాగే ఆఫీస్ క్యాంటీన్ 2,000 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి.
ఆఫీస్ లోనే కూర్చొని బీర్ లేదా వైన్ తాగే సౌకర్యాన్ని పొందాలంటే, హరియాణా ప్రభుత్వం నుండి ఎల్-10ఎఫ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం, ఎక్సైజ్ మరియు ఆదాయపు పన్ను కమిషనర్ విధించిన అన్ని షరతులను నెరవేర్చిన తర్వాత, రూ. 10 లక్షల రూపాయలతో లైసెన్స్ పొందవచ్చు.
అంతేకాకుండా, ఈ లైసెన్స్ (License) కోసం దరఖాస్తు చేసుకునే అన్ని కార్యాలయ అధికారులు రూ. 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఈ సదుపాయం జూన్ 12 నుంచి అమల్లోకి వస్తుందని హరియాణ ప్రభుత్వం తెలిపింది.