Harish Rao news Latest | మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి ఓ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. 17 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బీఆరెస్ లో తనకు తన వర్గానికి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని హరీష్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచార సారాంశం. ఇప్పటికే బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఆయన భేటీ అయినట్లు అతి త్వరలోనే కాషాయ పార్టీలో చేరనున్నట్లు కొన్ని పోస్టులు వైరల్ గా మారాయి.
అయితే జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది బీఆరెస్. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పనిగట్టుకొని చేసే ఇలాంటి చిల్లర ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని గులాబీ పార్టీ కోరింది.








