Harihara Veeramallau Release Date | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu) టీం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. హరిహర వీరమల్లు పార్ట్ 1 జూలై 24న విడుదల చేయనున్నట్ల సినిమా యూనిట్ శనివారం ఉదయం ప్రకటించింది.
ఈ సినిమా వాస్తవానికి జూన్ 12నే విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా వేశారు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదట క్రిష్ ఈ చిత్రంలోని కొంత భాగం తెరకెక్కించారు.
అనంతరం చిత్ర నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రానున్న ఈ సినిమాపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.