Friday 11th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పెళ్లైన 24 గంటలకే పెటాకులు.. వధువు తండ్రి వింత కండీషన్లు!

పెళ్లైన 24 గంటలకే పెటాకులు.. వధువు తండ్రి వింత కండీషన్లు!

UP Marriage

UP Marriage Conditions | వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. జీవితాంతం తోడుగా కలిసి ఉండే భాగస్వామిని ఆహ్వానించే ఈ వేడుకను ఉన్నంతలో ఘనంగా జరుపుకోంటారు. అలాగే యూపీలో ఓ యువకుడు తన పెళ్లి గురించి ఎన్నో కలలుగన్నాడు.

పెద్దలు చూసిన అమ్మాయిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఆనందోత్సాహాల నడుమ వివాహ తంతు ముగిసింది. వధూవరులు ఇద్దరూ వరుడి ఇంటికి వెళ్లారు. తెల్లవారితే రిసెప్షన్. అక్కడికి వచ్చిన వధువు సవతి తండ్రి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. వరుడికి 3 వింత షరతులు పెట్టాడు.

ఆ కండీషన్లతో కంగుతిన్న వరుడు.. ఏకంగా తనకు ఆ వివాహమే వద్దని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశాడు. దీంతోపెళ్లయి 24 గంటలు కూడా కాకముందే.. ముగిసిపోయింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా బారుసాగర్ కి చెందిన మన్వీంద్ర అనే యువకుడికి.. తన సమీప గ్రామంలో నివసించే జ్యోతి అనే యువతితో వివాహం నిశ్చయించారు. జూన్ 6 వ తేదీన మన్వీంద్ర, జ్యోతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి బరాత్‌ కూడా ఘనంగా నిర్వహించారు.

అనంతరం అప్పగింతల కార్యక్రమం ముగిసింది. వధూవరూలను ఇద్దరినీ వరుడి ఇంటికి సాగనంపారు. మరుసటి రోజు అయిన జూన్ 7 వ తేదీన రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే పెళ్లి కూతురు సవతి తండ్రి అందరికీ షాకిచ్చాడు. వరుడికి 3 విచిత్రమైన షరతులు విధించాడు.

ఆ షరతులేంటంటే..!

ఈ కొత్త దంపతులు ఇద్దరూ సెక్స్ చేసుకోవద్దని ప్రధానంగా షరతు విధించాడు వధువు సవతి తండ్రి.  వధువుతోపాటే ఆమె చెల్లెలు కూడా వరుడి ఇంటికి వస్తుందని.. ఆమెతో పాటే ఉంటుందని కండీషన్ పెట్టాడు.

ఇక మూడో షరతు ఏంటంటే.. తాను ఏ సమయంలోనైనా కుమార్తె ఇంటికి వస్తానని.. ఎందుకు వచ్చావని ఎవరూ అడగకూడదని తేల్చి చెప్పాడు. ఈ 3 షరతులకు అటు వరుడితోపాటు రిసెప్షన్‌కు హాజరైన బంధువులు కూడా షాక్ అయ్యారు.

వధువు సవతి తండ్రి పెట్టిన షరతులకు వరుడు కంగుతిన్నాడు. ఆ షరతులకు ససేమిరా అంగీకరించేది లేదన్నాడు. దీంతో రిసెప్షన్ మధ్యలోనే ఆగిపోయింది.

చేసేదేంలేక పెళ్లి కూతురు.. తన చెల్లి, తండ్రితో పాటు తన ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కోపంతో పెళ్లి కొడుకు తరఫు కుటుంబసభ్యులు.. స్థానికంగా ఉన్న బారుసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పెళ్లికి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అయిందని.. పెళ్లి కూతురుకు రూ. 3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పెట్టామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వధువుతోపాటు ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి కూడా తీసుకెళ్లాడు సవతి తండ్రి. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే విచారణ పూర్తిచేస్తామని చెప్పారు.

You may also like
‘మయన్మార్ సరిహద్దులో బందీలుగా ఉన్నవారిని కాపాడండి’
‘బాగుంది రా నితీష్ మామ..గిల్ నోట తెలుగు మాట’
బ్యాటరీ సైకిల్ సిద్ధూకు పవన్ అభినందనలు
SRHతో వివాదం..జగన్మోహన్ రావును అరెస్ట్ చేసిన సీఐడీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions