Gill Speaks Telugu | టీం ఇండియా టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్ నోట తెలుగు మాట వినిపించింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని ప్రశంసించే క్రమంలో గిల్ తెలుగులో మాట్లాడారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్-ఇండియా మధ్య మూడవ టెస్టు లార్డ్స్ మైదానం వేదికగా గురువారం మొదలైన విషయం తెల్సిందే. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. తొలుత ఇంగ్లాండ్ ఓపెనర్లు భారత బౌలర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
కానీ 14వ ఓవర్ వేసిన నితీష్ కుమార్ రెడ్డి మొదట బెన్ డకెట్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత అదే ఓవర్ లో మరో ఓపెనర్ జాక్ క్రాలీని పెవిలియన్ పంపాడు. ఈ సందర్భంగా నితీష్ వేసిన బంతులను మెచ్చుకునే క్రమంలో గిల్ బాగుంది రా మామ అంటూ తెలుగులో మాట్లాడారు.