Gautham Adani Donation | మనదేశంలోని అపర కుబేరుల్లో ఒకరైన అదానీ గ్రూప్ (Adani Group) చైర్మన్ గౌతమ్ అదానీ (Gautham Adani) తన చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeeth Adani) వివాహం సందర్భంగా రూ. 10 వేల కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశంలో ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, విద్యా రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అదానీ ఈ విరాళాన్ని ప్రకటించారు. రూ. 6 వేల కోట్లను ఆస్పత్రుల నిర్మాణానికి, మిగిలిన రూ. 2 వేల కోట్లను నైపుణ్యాభివృద్ధికి కేటాయించారు.
తాజాగా మిగిలిన రూ. 2 కోట్లను దేశంలో దాదాపు 20 స్కూల్స్ ఏర్పాటు కేటాయించారు. దేశవ్యాప్తంగా విద్యాలయాల ఏర్పాటు కోసం జీఈఎంఎస్ ఎడ్యుకేషన్‌తో అదానీ గ్రూప్‌కు చెందిన దాతృత్వ సంస్థ అయిన అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.
‘మొదటి విడత విరాళం కింద అదానీ కుటుంబం ఇచ్చే రూ. 2 వేల కోట్లతో.. సమాజంలోని పలు వర్గాల ప్రజలకు ప్రపంచ స్థాయి విద్య, శిక్షణ మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యం ప్రాధాన్యం ఇస్తుంది.’ అని అదానీ ఫౌండేషన్ తెలిపింది.
మొదటి అదానీ జీఈఎంఎస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్.. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరంలో లఖ్‌నవూలో ఏర్పాటు కానుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉండే ఈ స్కూల్స్‌ను రాబోయే 3 సంవత్సరాల్లో కనీసం 20 వరకు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపింది అదానీ ఫౌండేషన్.
ఈ స్కూల్స్ లో సీబీఎస్ఈ సిలబస్‌లో 30 శాతం వరకు సీట్లు పేదలకు కేటాయించి.. ఉచితంగా విద్యాబోధన కల్పించనున్నట్లు తెలిపింది.