Gautam Gambhir Strong Counter To Ricky Ponting | టీం ఇండియా ( Team India ) హెడ్ కోచ్ ( Head Coach )గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్డర్-గావస్కర్ ( Border Gavaskar ) ట్రోఫీ కోసం ఇప్పటికే టీం ఇండియా ఆస్ట్రేలియాకు పయనమైంది.
అయితే ఆసీస్ చేతిలో ఇండియా ఓటమి తప్పదని, సీనియర్లు విరాట్ కోహ్లీ ( Virat Kohli ), రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఫార్మ్ లపై విమర్శలు చేస్తున్న వారికి గంభీర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఒకవేళ రోహిత్ లేకపోయినా ఓపెనింగ్ కోసం చాలా ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. రోహిత్ విరాట్ ఫార్ముల పై ఎటువంటి ఆందోళన అనుమానం లేదని స్పష్టం చేశారు.
అయినా ఇండియన్ క్రికెట్ తో రికీ పాంటింగ్ ( Ricky Ponting ) కు ఏమి పని అని గంభీర్ ఘాటుగా ప్రశ్నించారు. అతను ఆస్ట్రేలియా గురించి ఆలోచిస్తే బెటర్ అంటూ సూచించారు. విరాట్ – రోహిత్ ఈ ఇద్దరూ భారత్ కు ఎన్నో సేవలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అలాగే న్యూజిలాండ్ ( New zealand ) టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత తనకు రోహిత్ కు మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తలను గంభీర్ కొట్టిపారేశారు. తమ మధ్య గొప్ప అనుబంధం ఉందని పేర్కొన్నారు.