- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
Dr. Vennela Takes Charge | రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మాదాపూర్‌లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సినీ నటుడు ఆర్, నారాయణ మూర్తి, విమల గద్దర్, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథిగా కృషి చేయాలని సూచించారు.
ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔనత్యాన్ని ఇనుమడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. డా.వెన్నెల నేతృత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం కావాలని అకాంక్షించారు.