Food Poison Again In Maganuru ZPHS School | తెలంగాణలోని పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ అవ్వడం కలకలం రేపుతోంది. వరుస ఘటనల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం సంచలనంగా మారింది. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది.
దింతో 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.