Farmer leaves paddy for birds | ప్రపంచానికి అన్నం పెట్టే రైతు కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరుగాలం శ్రమించి, గిట్టుబాటు కాని ధరకు పంటను అమ్ముకునే వాటితోనే మురిసిపోయే అల్పసంతోషి రైతు. రైతు తను వేసిన పంట అంటే తన ప్రాణానికి సమానంగా భావిస్తాడు.
తన బిడ్డలతో సమానంగా తన పంటను చూసుకుంటాడు. ఒక మాటలతో చెప్పాలంటే ప్రకృతిని కాపాడే సైనికుడు రైతు. అలాంటి రైతు మనసు ఎంత మంచిదో మరోసారి ప్రపంచానికి చాటిన గొప్ప ఉదంతం ఇది.
బంగ్లాదేశ్ కు చెందిన ఓ రైతు తన పండించిన పంటలో కొంత భాగాన్ని పక్షుల కోసం కేటాయిస్తున్నాడు. పంట చేతికి వచ్చిన తర్వాత కొంత భాగాన్ని కొయకుండా అలాగే వదిలేశాడు.
ఎందుకు అలా వదిలేశావు అని ఓ వక్తి ప్రశ్నించగా, పక్షులకు ఆహారం కోసం అని బదులిచ్చాడు. పంట కోసేటప్పుడు, అతను ఎల్లప్పుడూ తన దిగుబడిలో కొంత భాగాన్ని ప్రకృతి కోసం కేటాయిస్తానని వివరించాడు.
మనుషులు, వన్యప్రాణుల మధ్య సామరస్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కదా రైతు మనసు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.









