Fans Spot Cameraman In Squid Game-2 Crucial Scene | సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ( Web Series ) స్క్విడ్ గేమ్. ఇప్పటికే విడుదలైన తొలి సీజన్ విశేష ఆదరణ పొందింది.
తాజగా విడుదలైన స్క్విడ్ గేమ్-2 సైతం అభిమానుల అంచనాలను అందుకుంది. నెట్ఫ్లిక్స్ ర్యాంకింగ్స్ ( Netflix Rankings ) లో ఏకంగా 92 దేశాల్లో సీజన్ 2 టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. అయితే స్క్విడ్ గేమ్ 2 కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.
అదేంటంటే స్క్విడ్ గేమ్-2 ఫైనల్ ఎపిసోడ్ యాక్షన్ సీన్ ( Action Scene ) లో కెమెరామెన్ కనిపించారు. ఎడిటింగ్ చేసే సమయంలో కూడా ఈ సీన్ ను గమనించకపోవడంతో ఆ క్లిప్ అలానే ఫైనల్ వెర్షన్ ( Final Version ) లో కనిపించింది. దింతో ఫ్యాన్స్ సరదాగా ఆ సీన్ ను వైరల్ చేస్తున్నారు.
సాధారణంగా సీన్ ను నాలుగైదు కెమెరాలతో షూట్ చేస్తారు. అలా చేస్తున్న క్రమంలో ఓ కెమెరామెన్ సీన్ లో కనిపించాడు. దర్శకుడు హ్వాంగ్ డాన్ హ్యూక్ ( Hwang Dong Hyuk ) స్క్విడ్ గేమ్ 3 కూడా ఉంటుందని స్పష్టం చేశారు. 2025 లోనే ఈ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.