Friday 8th August 2025
12:07:03 PM
Home > తాజా > పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

FAKE CURRENCY IN AGRICULTURE LAND | ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నార్కట్ పల్లి-అద్దంకి రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సోమవారం నోట్ల కట్టలు పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించారు. కొన్ని కట్టలను తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ( Children Bank Of India ) అని ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ నకిలీ నోట్లేనని అయితే ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయి అనేది మాత్రం విచారణలో మాత్రమే తేలుతుందని సీఐ వెల్లడించారు.

You may also like
rahul gandhi
ఈసీకి రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు!
‘ది ప్యారడైజ్’..’జడల్’ గా రాబోతున్న నాని
‘కీళడి’ కోసం..ప్రధానిని కలిసిన కమల్ హాసన్
‘వావివరుసలు లేవు..సొంత కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేశారు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions