Elon Musk’s mother Maye Musk visits Mumbai’s Siddhivinayak temple | టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ భారతలో పర్యటిస్తున్నారు. తాను రాసిన ‘ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’ హిందీ ఎడిషన్ ను అవిష్కరించడానికి ముంబయి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ముంబయిలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ మేరకు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎలాన్ మస్క్ తల్లితో కలిసి జాక్వెలిన్ కూడా సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు.
మాయే మస్క్ తో కలిసి వినాయకుడ్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మాయే మస్క్ 77వ పుట్టినరోజు వేడుకల్ని కూడా ముంబయి లోనే జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ తల్లికోసం ప్రత్యేకంగా తయారుచేయించిన రోజా పువ్వుల బుకేను పంపించారు.