Eenadu Ramoji Rao | ఈనాడు గ్రూప్ (Eenadu) సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
88 ఏళ్ల రామోజీ రావు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. మరింత విషమించడంతో ఈరోజు కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. గుడివాడలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన అనంతరం 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ (Margadarshi Chitfunds) ఏర్పాటుచేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.
1969లో అన్నదాత ద్వారా మీడియా రంగంలోకి అడుగపెట్టి 1974 ఆగస్టు 10న ఈనాడు ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా కంట్రిబ్యూటర్ వ్యవస్థను పరిచయం చేసింది ఆయనే.