3 MLC Election Schedule | తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కంటే ముందు మరో ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. దీని కోసం ఫిబ్రవరి 3న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
వీటితోపాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. మార్చి 29న రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.