DRO Malola Caught Playing Online Rummy | అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ ( Review Meeting )జరుగుతుంది. అధికారులు అందరూ సమీక్ష చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు.
కానీ జిల్లా రెవెన్యూ అధికారి మలోల మాత్రం ఫోన్ చేత పట్టి ఆన్లైన్ ( Online ) లో పేకాట ఆడుతూ కనిపించాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులే ఇలా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతూ డీఆర్వో ( DRO ) ఎంజాయ్ చేస్తున్నారని జగన్ పార్టీ మండిపడింది. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోల హాజరయ్యారు.
ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాల నేతలు వచ్చారు. కానీ వారిని పట్టించుకోకుండా రమ్మీలో డీఆర్వో మలోల మునిగిపోయారని వైసీపీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ప్రభుత్వ అధికారులతో ఇలానేనా మీరు పని చేయించేది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను జగన్ పార్టీ ప్రశ్నించింది.