Dr. Vinod Kumar Yata | ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధస్సు (AI) మరియు బయోమెడికల్ పరిశోధన రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖ పరిశోధకుడు, అధ్యాపకుడు డాక్టర్ వినోద్ కుమార్ యాటకు అరుదైన గౌరవం లభించింది. ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ‘వందే భారత్ ఉగాది గౌరవ్’ పురస్కారాన్ని అందజేశారు.
ఉగాది వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో సామాజిక ప్రభావం చూపిన ప్రతిభావంతులకు ఇచ్చే ఈ అవార్డును.. సీనియర్ నటులు, మాజీ మంత్రి బాబూ మోహన్.. డాక్టర్ వినోద్ కుమార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఏఐ-ఆధారిత సాంకేతికతల ద్వారా భారతీయ ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరచడానికి, సామాన్యుడికి నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తానని తెలిపారు
వినోద్ కుమార్ యాటా ప్రస్తుతం మల్లారెడ్డి యూనివర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్’లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆయనకు క్యాన్సర్ బయాలజీ, నానోటెక్నాలజీ, మైక్రోఫ్లూయిడిక్స్ మరియు యానిమల్ బయోటెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో సుదీర్ఘ పరిశోధనా నేపథ్యం ఉంది.
ఇటీవల కాలంలో ఆయన వ్యాధి అంచనా మరియు రోగి సంరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో ‘ఏఐ-ఆధారిత క్లినికల్ నిర్ణయ మద్దతు వ్యవస్థలను’ అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.
వాస్తవ ప్రపంచ క్లినికల్ సెట్టింగ్‌లలో ఏఐ నమూనాలను అమలు చేయడానికి ఆయన బృందానికి ‘నేషనల్ క్యాన్సర్ గ్రిడ్’ నుండి మద్దతు లభించడం విశేషం.






