Divyabharathi Open Statement On Dating GV Prakash | సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు నటి దివ్యభారతి.
నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి ఇటీవలే విడాకులు తీసుకున్నారు. అయితే వీరు విడిపోవడానికి దివ్యభారతే కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గతంలోనే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని దివ్యభారతి స్పష్టత ఇచ్చినా విమర్శలు మాత్రం ఆగలేదు.
ఈ నేపథ్యంలో నటి తాజగా సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. తనకు జీవీ ప్రకాష్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. సంబంధం లేని విషయాల్లో తన పేరును లాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఒక నటుడ్ని అదీ కూడా పెళ్లైన వ్యక్తిని డేటింగ్ చేసే ప్రసక్తే లేదని తెలిపారు.
హద్దు మీరి కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తన పేరు ప్రతిష్టలు దెబ్బతినే విధంగా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఈ సందర్భంగా దివ్యభారతి కోరారు.