Friday 18th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దేవరగట్టులో బన్నీ ఉత్సవం..కర్రల యుద్ధంలో గాయాలు

దేవరగట్టులో బన్నీ ఉత్సవం..కర్రల యుద్ధంలో గాయాలు

Devaragattu Bunny Utsavam | ఏటా దసరా సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఒక్కోరకంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా కర్నూల్ ( Kurnool ) జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు ( Devaragattu )లో జరిగే బన్నీ ఉత్సవం ఉభయ తెలుగురాష్ట్రాల్లో విశేష ప్రాచుర్యం పొందింది.

దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి ( Mala Malleshwaraswamy )ఉత్సవవిగ్రహాలను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు కర్రల సమరంలో తలపడుతారు. దీనినే బన్నీ ఉత్సవం అంటారు.

సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల యుద్ధంలో హింస చెలరేగింది. కర్రలతో పలు గ్రామాల ప్రజలు కొట్టుకోవడంతో సుమారు 100మందికి పైగా గాయాలయ్యాయి.

ఇందులో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆదోని, బళ్లారి ఆసుపత్రికి తరలించారు.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions