Deputy Cm Pawan Kalyan On Nitish Kumar Reddy | బాక్సింగ్ డే టెస్టు ( Boxing Day Test ) మ్యాచులో యువ ఆటగాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ పై సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం జగన్ నితీష్ రెడ్డి ఆటతీరును కొనియాడారు. తాజగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
‘ మీరు ‘భారత్’లో ఏ భాగం నుంచి వచ్చారన్నది కాదు, ‘భారత్’ కోసం మీరు ఏం చేశారన్నది ‘భారత్’కు గర్వకారణం. ప్రియమైన ‘నితీష్ కుమార్ రెడ్డి,’ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత్ నుంచి అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినందుకు. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) యొక్క కీలకమైన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో మీరు 114 పరుగులతో అద్భుతమైన నాక్‌తో మీ ప్రతిభను ప్రదర్శించారు. మీరు మరెన్నో ప్రపంచ స్థాయి రికార్డులను సాధించడం కొనసాగించండి, భారత్ జెండాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి మరియు యువతకు క్రీడల పట్ల అభిరుచి మరియు దృఢ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వండి. ఈ సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.