Deputy Cm Pawan Kalyan Comments On YCP | అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా డిమాండు పేరుతో వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తోందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ఉందని జనసేన కంటే ఒక సీటు అధికంగా తెచ్చుకొని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేదన్నారు. కానీ వారికి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.
వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ అయిదేళ్లలో రాదు ఫిక్స్ అయిపోండని వైసీపీ కి పవన్ సూచించారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబో, తానో కావాలని చేసింది కాదని ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం, మన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.
సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలుంటాయని.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు.
ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించినట్లు.. అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటారని, ఇక్కడ సీట్లు ప్రాతిపదికగా ఉంటుందని వైసీపీవాళ్లు గ్రహించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు.