Monday 16th March 2026
12:07:03 PM
Home > బిజినెస్ > రికార్డు స్థాయికి పసిడి ధర బంగారం ధర మరో ఆల్‌టైమ్‌ హై రికార్డుకు చేరింది.

రికార్డు స్థాయికి పసిడి ధర బంగారం ధర మరో ఆల్‌టైమ్‌ హై రికార్డుకు చేరింది.

Crude price hits record high Gold price hits another all-time high.

-తులం రూ.64,300
-హైదరాబాద్‌లో రూ.440 పెరుగుదల
-రూ.83,500 వద్దే వెండి

రోజుకింత పెరుగుతూ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు ప్రకంపనల్నే సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో తులం ఇంకో రూ.440 ఎగిసింది.
బంగారం ధర మరో ఆల్‌టైమ్‌ హై రికార్డుకు చేరింది. రోజుకింత పెరుగుతూ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు ప్రకంపనల్నే సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో తులం ఇంకో రూ.440 ఎగిసింది. ఫలితంగా క్రితమెన్నడూ లేనట్టుగా 24 క్యారెట్‌ పసిడి 10 గ్రాములు రూ.64,200ను తాకింది. ఆభరణాలు తయారు చేయడానికి వినియోగించే 22 క్యారెట్‌ పుత్తడి రేటు కూడా రూ.400 ఎగబాకి రూ.58,850ని చేరుకున్నది. ఇదిలావుంటే ఢిల్లీలోనూ బంగారం ధరలు పరుగులు పెట్టాయి. రూ.450 పుంజుకొని రూ.64,300 వద్ద 24 క్యారెట్‌ పసిడి ధర స్థిరపడింది. అలాగే 22 క్యారెట్‌ 10 గ్రాములు రూ.410 పెరిగి రూ.58,950గా నమోదైంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions