Thursday 17th April 2025
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ లో గొడవలున్నాయి: సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు!

కాంగ్రెస్ లో గొడవలున్నాయి: సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు!

vh pressmeet

V Hanumantha Rao Pressmeet | తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

అగ్రకులాల వాళ్ళు ఓబీసీలను అణగదొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుందన్నారు.

బీసీల హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మూడు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

త్వరలో రాష్ట్రంలో బీసీ ల భారీ బహిరంగా సభ నిర్వహిస్తామన్నారు వీహెచ్. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. ఈ సభను అందరు సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

కొందరు పొద్దున లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కావాలని అంటున్నారు.. ముందు ఫస్ట్ 27 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దామని వ్యాఖ్యానించారు.

బీసీ లకు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.

“జనాభా ప్రతిపదికన బీసీ లకు రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో బీజేపీ వెన్నులో వణుకుపుట్టింది.

కులాల పేరుతో మనం కొట్టుకోకుండా ఐక్యంగా ఉండాలి. మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలి.

పేదల గురించి ఆలోచించే కుటుంబం గాంధీ కుటుంబం. పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ-మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

గరీబీ హఠావో అనే నినాదం తో పేద ప్రజలకు సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దాం అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు వీ హనుమంత రావు.

కేసీఆర్ (KCR) కాంగ్రెస్ నాయకులను బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు. నువ్వెందుకు వేస్తావు. జనం నిన్నే బంగాళాఖాతంలో వేస్తారు.

సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా దేదో అనే అడక్కునే వాడివి. అన్నం పెట్టినోనికి సున్నం పెడతాడు కేసీఆర్.

ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడు

దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ (Rahul Gandhi) పెరిగింది. పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడు. మీ బాబై కూర్చున్నాడు.  

ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడు. లేకుంటే నా పేరు హనుమంతరావు కాదు.

ఏడాదికి రూ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.

ఆదానీకి మోదీకి ఎం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు. మా దగ్గర ఉంటే అవినీతి పరులు. బీజేపీలో చేరితే సత్యహరిచంద్రులు”

 గొడవలున్నాయి..

 తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయన్నారు వి. హనుమంత రావు. సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా అని ప్రశ్నించారు.

తమ పార్టీలో లొల్లి కూడా అంతేనన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల తరుపున తాను మాట్లాడుతానన్నారు.

పార్టీ లోకి ఎవరైనా రానివ్వాలనీ, అలాగే పార్టీ కోసం జెండా మోసినవరిని పార్టీ మర్చిపోకూడదని హితవు పలికారు. 

You may also like
‘తెలంగాణలో జపాన్ వ్యాపార దిగ్గజం భారీ పెట్టుబడులు’
‘సింగరేణి చరిత్రలో అద్భుత ఘట్టం’
‘తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్..సీఎం రేవంత్ హర్షం’
nithin
‘అక్కడ 3 రోజులు ఉంటే జబ్బులు ఖాయం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions