Congress Manifesto | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను (Congress Manifesto) విడుదల చేసింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే (Mallikharjun Kharge), అగ్ర నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)తదితరులు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
48 పేజీలో కూడిన ఈ మేనిఫెస్టోను న్యాయ పత్ర గా నామకరణం చేశారు. ఇందులో ఐదు న్యాయలతో పాటు 25 గ్యారంటీలను ప్రకటించారు. హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ , యువ న్యాయ్, నారి న్యాయ్ కింద సుమారు 25 గ్యారంటీలను ప్రకటించారు.
ఇందులో ముఖ్యంగా పేద మహిళలకు ప్రతి ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం, ఆర్డీక, సామాజిక, కుల గణన, 30 లక్షల ఉద్యోగాల భర్తీ, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష ఫీజులు రద్దు, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా, అగ్నిపథ్ పథకం రద్దు, ఎలెక్టోరల్ బాండ్స్, రఫెల్ , పెగేసస్ పై విచారణ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజెర్వేషన్లు తదితర హామీలను ప్రకటించింది కాంగ్రెస్.