Wednesday 21st May 2025
12:07:03 PM
Home > తాజా > “నీది రా కుట్ర…” కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్!

“నీది రా కుట్ర…” కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్!

chamala kiran kumar reddy

Congress MP Chamala Counter To KTR | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై కౌంటర్ ఇచ్చారు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు అధికారులపై లగచర్ల లో దాడి ఉదంతం వెనుకాల బీఆరెస్ పార్టీ మరియు కేటీఆర్ కుట్ర ఉందని అధికార నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఎవనిదిరా కుట్ర ఏంది ఆ కుట్ర అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దింతో తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

‘నీది రా కుట్ర… నీ అయ్యది రా కుట్ర, తరతరాలకు సరిపోయే భూమిని ఒక దశాబ్దంలోనే దోచిన…
నీది రా కుట్ర… నీ కుటుంబానిది రా కుట్ర.
ఫాంహౌస్ ల కోసమో… రిసార్టుల కోసమో కాదు రా…
ఉద్యోగ ఉపాధి అవకాశాల సృష్టికి మా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీది రా కుట్ర
పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసి…
బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన మీది రా కుట్ర.
మల్లన్న సాగర్ ను కన్నీటి సాగర్ గా మార్చిన మీదిరా కుట్ర.
రంగ నాయక సాగర్ ను రక్తాలు పారే సాగర్ గా మార్చిన మీది రా కుట్ర.
అరెస్టు… అరెస్టు… అరెస్టు అని తెగ కలవరిస్తున్నావు…
ఇది కదా నీ అసలు భయం! ‘ అంటూ చామల రెచ్చిపోయారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions