Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > హామీలన్నీ నెరవేరుస్తాం.. బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి!

హామీలన్నీ నెరవేరుస్తాం.. బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి!

congress mlc jeevan reddy

Congress Leader Bond Paper | ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు ఎమ్మెల్సీ, జగిత్యాల (Jagityal) కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి. (Jeevan Reddy) అంతేకాకుండా ఆ బాండ్ పేపర్ పై సంతకం చేసి, ఆలయంలో ప్రమాణం సైతం చేశారు.

ఈ మేరకు సోమవారం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాండ్ పేపర్ ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను (Congress 6 Guarantees) నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

అలాగే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని బాండ్ పేపర్ (Bond Paper)లో  పేర్కొన్నారు జీవన్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రకటించిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రమాణం చేసారాయన.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తానని, నిజాయితీ, నిబద్దతతో తన బాధ్యతలు నిర్వర్తిస్తానని… అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనిచేస్తానని పేర్కొన్నారు జీవన్ రెడ్డి.

You may also like
‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’
‘పాక్ కు లోన్..IMF పై విరుచుకుపడ్డ ఒవైసీ’
‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’
‘పాక్ లో పట్టుబడ్డ భారత పైలట్..నిజం ఏంటంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions