Jaggareddy Comments on Kavitha Bail | ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) ఆరోపణలతో అరెస్టైన బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కు మంగళవారం బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కవిత బెయిల్ పై కాంగ్రెస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.
కవితకి బెయిల్ రావడంతో బీజేపీలో బీఆరెస్ విలీనమా లేదా? వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్స్ పోత్తా..? మోడీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా కింగ్ కవిత కి ఐదు నెలలకే బెయిల్ ఎలా వచ్చిందన్నారు.
“17 నెలల వరకు సిసోడియా కి బెయిల్ రాలేదు. ఐదు నెలలకే కవితకి బెయిల్ ఎలా వచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ నీ దెబ్బతీసేందుకు బీజేపీ బీఆరెస్ కుట్ర పన్నాయి.
జడ్జి బెయిల్ ఆర్డర్ ఇవ్వకముందే మూడు రోజులుగా కేటీఆర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా హడావుడి చేశారు. బీజేపీలో బీఆరెస్ వచ్చే ఎన్నికల లోపు విలీనం కావచ్చు లేదంటే పొత్తు పెట్టుకోవచ్చు. బెయిల్ వస్తుందని ముందే చెప్పిన కేటీఆర్ పైనే కోర్టు చర్యలు తీసుకోవాలి.
బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని బీఆరెస్ సోషల్ మీడియా ప్రచారం చేశారు. కేటీఆర్ రెండు రోజుల ముందే డిల్లీలో హడావుడి చేశారు. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆరెస్ చెప్పేస్తోంది.
బీజేపీ ప్రభుత్వం బీఆరెస్ కి ఒప్పందాల్లో భాగంగానే కవితకు బెయిలొచ్చింది.
తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకే బీజేపీ బీఆరెస్ కలిసి పోయే దాంట్లో భాగమే లిక్కర్ కేసు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆరెస్ ను బీజేపీ కలుపుకునే పనిలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ డమ్మీ పాత్ర పోషించింది.
కవిత బెయిల్ కండిషన్ లో భాగమే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారు. మెదక్ లో బీఆరెస్ గెలుస్తదనే పరిస్థితి లో మూడో స్థానానికి ఎందుకు పోయింది? కవిత కోసం సొంత పార్లమెంట్ నియోజక వర్గం కేసీఆర్ వదిలేసుకున్నారు.
మాకు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ బీఆరెస్ కలిసి పోవడమే కారణం.
రాజకీయంగా కాంగ్రెస్ నీ బలహీన పరిచే ఒప్పందం లో భాగమే బీజేపీ బీఆరెస్ ఎత్తుగడ బీజేపీ లో బీఆరెస్ విలీనం అవుతుందనే ప్రచారం చేసి వచ్చే ఎన్నికల్లో బీఆరెస్-బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నయి. కవిత బెయిల్ రావడం బీఆరెస్ బీజేపీ చీకటి ఒప్పందం లో భాగమే.
బీజేపీ గెలిచిన పార్లమెంటు నియోజక వర్గాల్లో రేపు ఎన్నికలు అనగా బీఆరెస్ ఎజెంట్ లు ఎంఎల్ఏ లు కూడా లేరు. బీఆరెస్ ఎంపీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కి వేయకండి బీజేపీ కి వేయండి అని ప్రచారం చేశారు. బీజేపీ ఉత్తరాదిన వీక్ అయ్యింది దక్షిణాది లో బీఆరెస్ నీ బలహీన పరిచారు. ఏపీ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని సీట్లు గెలిచారు. బీఆరెస్ ఓ పావుగా బీజేపీ కి పని చేస్తుంది. అని ఆరోపించారు జగ్గారెడ్డి.