Congress Files Petition On Kcr Speech| బీఆరెస్ అధినేత కేసీఆర్ ( Kcr ) పై కోర్ట్ లో పీటీషన్ ( Petition )ను దాఖలు చేశారు కాంగ్రెస్ యువ నేత బల్మూరి వెంకట్ ( Balmoor Venkat ).
ఎన్నికల ప్రచారం లో భాగంగా కేసీఆర్ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, వెంటనే ఆయన్ను కట్టడి చేయాలని, కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హై కోర్ట్ ( High Court ) లో పిటిషన్ ను దాఖలు చేశారు బల్మూరి వెంకట్.
కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ( Election Comission ) కు ఫీర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు ఈ కాంగ్రెస్ నేత.
కాగా ఇటీవల మెదక్ ఎంపీ, దుబ్బాక ( Dubbaka ) బీఆరెస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి తో దాడి జరిగిన విషయం తెల్సిందే. ఈ దాడి అనంతరం బాన్స్వాడ ( Banswada ) బీఆరెస్ ప్రజా ఆశీర్వాదా సభలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు.
ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు కేసీఆర్. మేము తలచుకుంటే దుమ్ము దుమ్ము అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పీచ్ ( Speech ) తర్వాత కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తల పై దాడులు పెరిగాయని, బీఆరెస్ వారు భయాందోళనకు గురి చేస్తున్నారంటూ పిటిషన్ లో ఆరోపించారు బల్మూరి వెంకట్.
కేసీఆర్ స్పీచ్ రెచ్చగొట్టే విదంగా ఉన్నాయని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తెలిపారు ఆయన.
ఈ నేపథ్యంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని దాని కోసం తగిన ఆధారాలు కూడా ఇచ్చినట్లు స్పష్టం చేశారు ఈ కాంగ్రెస్ ( Congress ) నేత. కాగా బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం (నవంబర్ 16) నాడు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.