Monday 16th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > అభినందనలు తెలిపిన బండి సంజయ్

అభినందనలు తెలిపిన బండి సంజయ్

Congratulations to Bandi Sanjay

-తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
-నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
-తన పదవీకాలంలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నా

ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ బరిలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. వారు తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా” అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions