Friday 20th March 2026
12:07:03 PM
Home > తాజా > పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!

పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!

tg ssc results

TG 10th Class Results | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ లోని రవీంద్ర భారతి (Ravindra Bharathi) లో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ క్లాస్ పరీక్షల్లో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇందులో 91.32 శాతం బాలురు, 94.26 శాతం బాలికలు ఉత్తీర్ణులు అయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 4629 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం 2 స్కూళ్లలో మాత్రమే పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎవరూ పాస్ అవ్వలేదు. ఈ సారి ఫలితాల్లో గ్రేడ్ లకు బదులుగా మార్కులు ఇచ్చారు.

అత్యధికంగా ఉత్తీర్ణతలో మహబూబా బాద్ అగ్రస్థానంలో ఉండగా, అతి తక్కువ ఉత్తీర్ణతతో వికారాబాద్ చివరిస్థానంలో నిలిచింది. జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఎస్​ఎస్​సీ బోర్డు వెల్లడించింది.

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు మే 15 వరకు అవకాశం కల్పించారు. సబ్జెక్టుకు రూ.500 చెల్లించి రీకౌంటింగ్‌ దరఖాస్తునకు అవకాశమిచ్చారు. సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించి రీవెరిఫికేషన్‌ దరఖాస్తునకు అవకాశం కల్పించారు.

You may also like
CM Revanth's speech in the Madiga Employees Coordination Committee programme
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అది అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: సీఎం
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
bandi sanjay
‘ఆ కుటుంబానికి రూ.1000 కోట్లుపంపేందుకే కేబినెట్ మీటింగా?’
cm revanth proposes ai ministry in india
‘ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions