Monday 30th March 2026
12:07:03 PM
Home > తాజా > అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?

అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?

Cm Revanth Reddy On Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) మరోసారి జైలుకు వెళ్తారా ? అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కారణం సంధ్య థియేటర్ ఘటన మరియు అల్లు అర్జున్ తీరు పట్ల రేవంత్ సర్కారు గుర్రుగా ఉంది. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

అలాగే ఒక్కరాత్రి జైలులో ఉండి వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి టాలీవుడ్ ( Tollywood ) ప్రముఖులు వెళ్లారని కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ( Sritej ) ను ఎవరైనా కలిశారా అంటూ సీఎం ఘాటుగా ప్రశ్నించారు.

ఈ క్రమంలో త్వరలో అల్లు అర్జున్ బెయిల్ ( Bail ) రద్దు అవుతుందని అప్పుడు ఆయన్ను తిరిగి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కొందరు కామెంట్లు పెడుతున్నారు. తొక్కిసలాట కేసులో ఏ 11 ( A-11 ) గా ఉన్న అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే.

అనంతరం జైలుకు తరలించగా హై కోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions