CM Revanth Reddy News | తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీడీపీపై కక్ష గట్టి ఆ పార్టీని తెలంగాణలో దెబ్బతీసిన కేసీఆర్ పార్టీని పాతిపెట్టాలన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటించి రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన అమలు చేసిన సంక్షేమ పనులను గుర్తుచేశారు. నాడు రూ.2 కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం అన్నారు.
ఆ పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో వినూత్నంగా ముందుకు తీసుకెళ్తూ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరులు, సహచరులు ఉన్నారని పేర్కొన్న సీఎం తెలుగుదేశం పార్టీపై కక్షగట్టి టీడీపీ నాయకులను దెబ్బతీసిన కేసీఆర్ బీఆరెస్ పార్టీని పాతి పెట్టినప్పుడే ఎన్టీఆర్ కు ఘన నివాళి ఇచ్చినట్లు అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు.








