Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > మేడారంలో వనదేవతల గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్!

మేడారంలో వనదేవతల గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్!

cm revanth medaram visit

CM Revanth Medaram Visit | ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహా జాతర (Medaram Jathara) అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యంత వైభవంగా పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భక్తులకు అంకితం చేశారు.

ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి, పునర్నిర్మాణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మొదట అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వన దేవతలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తన మనవడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తులాభారంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానమైన 68 కిలోల బెల్లం వనదేవతలకు సమర్పించారు. అనంతరం సీఎం రేవంత్ నేరుగా దావోస్ పర్యటనకు వెళ్లారు.

మేడారం అభివృద్ధిలో భాగంగా నాలుగు వేల టన్నుల గ్రానైట్‌తో నిర్మాణాలు చేపట్టి, ఆదివాసీ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా 7 వేల శిల్ప చిత్రాలను చెక్కారు. గద్దెల ప్రాంగణాన్ని 46 పిల్లర్లు, విశాల స్వాగత తోరణాలతో చారిత్రక కట్టడాల తరహాలో తీర్చిదిద్దారు.

గోడలపై కోయ వంశీయుల చరిత్రను ప్రతిబింబించే శిల్పాలు, ప్రధాన తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

You may also like
gurram guda forest land
గుర్రం గూడ అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటింపు
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions