- బీఆరెస్ సభ్యులకు సీఎం రేవంత్ హెచ్చరిక
CM Warns BRS Members | అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆరెస్ సభ్యులపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).
బీఆరెస్ (BRS) సభ్యులు మాట్లాడితే తాము 39 మంది ఉన్నాం.. అచ్చోసిన ఆంబోతుల్లా ఉన్నాం.. పోడియం వద్దకు వచ్చి కుస్తీలు పడతాం అంటే కుదరదని హెచ్చరించారు సీఎం రేవంత్.
అలాగే ప్రజాస్వామ్యంలో 49 శాతం వచ్చినా దాని విలువ సున్నానే అని, 51 శాతం వచ్చిన వారికి మాత్రం 100 శాతం విలువ ఉంటుందని తెలిపారు.
Read Also: రేవంత్ వర్సెస్ కేటీఆర్.. హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశాలు!
ఎందుకంటే 51 శాతం వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, 49 శాతం వచ్చిన వారు ప్రతిపక్షంలో కూర్చుంటారని స్పష్టం చేశారు.
ప్రతిపక్షంగా, ప్రభుత్వానికి సహేతుకమైన సూచనలు ఇవ్వాలి కాని ఇలానే మాట్లాడుతూ ఉంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు అని వ్యాఖ్యానించా సీఎం రేవంత్ రెడ్డి.