CM Revanth Reddy Distribute Appointment Letters to Group 3 Candidates | చంద్రబాబు నాయుడుకి ఉద్యోగ నియామక పత్రం అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో శుక్రవారం ‘ప్రజా పాలనలో కొలువుల పండగ’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
ఏ. చంద్రబాబు నాయుడు అనే అభ్యర్థికి ముఖ్యమంత్రి నియామక పత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు అని పేరు పిలవగానే కార్యక్రమంలో పాల్గొన్న వారు కేరింతలతో సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం పేరుతో ఉన్న ఆ అభ్యర్థికి సీఎం రేవంత్‌రెడ్డి నవ్వుతూ అభినందనలు తెలిపి పత్రాన్ని అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.










