Harish Rao Fires On Cm Revanth | అసెంబ్లీ ( Assembly ) లో సీఎం రేవంత్ ( Cm Revanth )చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ).
కాగా బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ఆ అక్కల మాటలు వింటే బీఆరెస్ ( BRS ) నాయకులు జూబ్లీ బస్ స్టాండ్ ( Jublie Busstand ) లో కూర్చోవాల్సిందే అని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించిన హరీష్ రావు, నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని ముఖ్యమంత్రి వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ( Demand ) చేయడమే తప్పా.? అని ప్రశ్నించారు.
మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నరని హరీష్ రావు హెచ్చరించారు.