Friday 23rd May 2025
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా!

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా!

kcr revanth

CM Revanth enquires KCR Health | బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో జారిపడటంతో తుంటి ఎముకకు గాయం అయ్యింది.

దీంతో యశోద ఆసుపత్రి (Yashoda Hospital) కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

కేసీఆర్ వైద్యంపై ఎప్పటికప్పుడు తనకు అప్డేట్స్‌ ఇవ్వాలని అధికారులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి సూచించారు సీఎం. సీఎం ఆదేశాలతో యశోద హాస్పిటల్‌కు ఆరోగ్యశాఖ కార్యదర్శి వెళ్లారు.

వైద్యాధికారులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి గురించి యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వెంటనే వెంటనే ప్రభుత్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్‌ తో కేసీఆర్‌ను ఆసుపత్రికి పోలీస్ అధికారులు తరలించారు.

కెసిఆర్ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో అక్కడ భద్రత పెంచాలని అధికారులకు ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు కెసిఆర్ వున్న ఆసుపత్రి వద్ధ భద్రతను కట్టుదిట్టం చేశారు.

You may also like
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!
Metro
మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!
cm revath reddy
సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions